టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై స్పందించాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. మహీ వీడ్కోలు నిర్ణయంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ఈ వైరస్ లేకపోయి ఉంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడి ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ప్రపంచకప్ కరోనా కారణంగా 2022కు వాయిదా పడింది. మహీ టీమ్ఇండియా తరఫున మైదానంలో ఇంకా ఆడాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు చాహల్.
ధోనీ వల్లే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, తాను బౌలర్లుగా విజయవంతంగా రాణిస్తున్నామని తెలిపాడు చాహల్. మహీకి పిచ్‌పై బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో, ఎలా వేయాలో బాగా తెలుసని చెప్పాడు. కెరీర్లో 52 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు చాహల్. ఐపీఎల్ 13వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇది చూడండి 'ధోనీ సాధించడానికి ఇంకేమీ మిగల్లేదు.. శకం ముగిసింది'