కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో వెల్లడించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రీడాకారులను శ్రీలంక పర్యటనకు పంపడం సాధ్యం కాదంటూ బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపినట్టు సమాచారం. శ్రీలంకతో జూన్-జులైలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమ్ఇండియా వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్టు ఐసీసీ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు.
-
India's tour to Sri Lanka, which was scheduled to take place later this month, has become the latest series to be postponed due to the ongoing COVID-19 pandemic. pic.twitter.com/nqO3urKiNP
— ICC (@ICC) June 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India's tour to Sri Lanka, which was scheduled to take place later this month, has become the latest series to be postponed due to the ongoing COVID-19 pandemic. pic.twitter.com/nqO3urKiNP
— ICC (@ICC) June 11, 2020India's tour to Sri Lanka, which was scheduled to take place later this month, has become the latest series to be postponed due to the ongoing COVID-19 pandemic. pic.twitter.com/nqO3urKiNP
— ICC (@ICC) June 11, 2020
"జూన్-జులైలో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుత సంక్షోభ సమయంలో సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ టోర్నీని ఆగస్టులో నిర్వహించాలని యోచిస్తున్నాం".
-అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి.
కరోనాతో విధించిన లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రీడోత్సాహానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో భారత్ × శ్రీలంక మ్యాచ్లు వాయిదా పడిన వార్త తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొంటూ పలువురు క్రీడాభిమానులు సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి... ఆ షాట్లను మిస్ అవుతున్నా: రోహిత్