ETV Bharat / sports

ఐసీసీ బాల్​ టాంపరింగ్​ను లీగల్ చేయనుందా! - ఐసీసీ బాల్ టాంపరింగ్

కరోనా ప్రభావం తర్వాత క్రికెట్​ ప్రారంభమైతే నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది. బంతి మెరుపు కోసం బౌలర్ ఉమ్మిని ఉపయోగించడానికి బదులు కృత్తిమ పదార్థాన్ని వాడేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అందుకోసం బాల్ టాంపరింగ్ నిబంధనల్లో మార్పులు చేయనుందట.

ఐసీసీ
ఐసీసీ
author img

By

Published : Apr 24, 2020, 3:43 PM IST

కరోనా కారణంగా క్రీడలకు గడ్డుకాలం నడుస్తోంది. టోర్నీలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియట్లేదు. క్రికెట్ సిరీస్​ల ప్రారంభానికి సమయం పట్టేలా ఉంది. అయితే ఒకవేళ ప్రారంభమైనా ఆటలో కొన్ని మార్పులు కనిపించనున్నాయి. అందులో ఒకటి బంతి మెరుపు కోసం బౌలర్ దానికి ఉమ్మి రాయడం. దీనిపై చర్చించేందుకు సిద్ధమైంది ఐసీసీ. దానికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. అందులో ఒకటి కృత్తిమ పదార్థంతో బంతిని రుద్ది మెరుపు తీసుకురావడం.

"కృత్తిమ పదార్థం ద్వారా బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు ఒక అవకాశం ఉంది. అంపైర్ల సమక్షంలో ఆటగాడు ఆ పదార్థాన్ని ఉపయోగించి బంతికి మెరుపు తీసుకురావచ్చు. దీనిపై ఐసీసీ కూడా ఆలోచిస్తోంది." అని ఈఎస్​పీఎన్ క్రిక్​ఇన్ఫో సంస్థ తెలిపింది.

కృత్తిమ పదార్థంతో బంతికి మెరుపు తీసుకురావడం అనేది బాల్​టాంపరింగ్ కిందకు వస్తుంది. కాబట్టి ఆ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని ఐసీసీ భావిస్తోంది.

ఎందుకు!

ప్రస్తుతం ఆటగాళ్లు బంతికి మెరుపు తీసుకురావడానికి ఉమ్మిని ఉపయోగిస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఉమ్మిని వాడటం అంత మంచిది కాదని ఐసీసీ భావిస్తోంది. దానివల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఇప్పటికే ఐసీసీ మెడికల్ కమిటీ తేల్చి చెప్పింది. అందుకోసం ప్రత్యామ్నాయాలను పరిశీలించింది ఐసీసీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.