ప్రముఖ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇకపై పోలీసు సిబ్బందికి వైద్య సేవలు అందించనున్నారు. కరోనా నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ వర్కర్క్స్ కోసం ఇక్కడ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు బంగాల్ క్రికెట్ సంఘం శుక్రవారం అనుమతులిచ్చింది. స్టేడియంలోని ఈ, ఎఫ్, జీ, హెచ్ బ్లాక్‌లను ప్రస్తుతం వినియోగించనున్నారు. అయితే కేసులు పెరిగినా.. స్థలం సమస్య ఏర్పడినా జే బ్లాక్ కూడా వాడుకోవచ్చని క్యాబ్ యాజమాన్యం అంగీకారం తెలిపింది. బీ, సీ, డీ, కే, ఎల్ బ్లాక్‌లను మాత్రం మైదాన, పాలనాపరమైన పనులకు వాడనున్నారు.
"ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాధికారులకు మద్దతివ్వడం మా కర్తవ్యం. ఈడెన్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కేవలం పోలీసు సిబ్బందికే దీన్ని వినియోగించనున్నారు. వారికి కేటాయించిన ఐదు బ్లాక్‌లకు ప్రత్యేకమైన రాకపోకలు ఉండేలా ఏర్పాట్లు చేశాం. కోల్‌కతా పోలీసు, క్యాబ్ మధ్య సహాకారం, స్నేహభావంలో భాగంగా ఇదంతా చేస్తున్నాం"
- ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి
మైదాన సిబ్బంది, స్టాఫ్ ఉండేందుకు స్టేడియంలోని మిగతా బ్లాక్‌ల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఐపీఎల్‌కు ముందే మరో టీ20 లీగ్.. ఆగస్టు 18 నుంచే