ETV Bharat / sports

ఓ ఇంటి వాడు కాబోతున్న బుమ్రా- గోవాలో పెళ్లి - సంజనా గణేశన్

భారత పేస్​ స్టార్​ జస్ప్రీత్​ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మోడల్​, టీవీ ప్రజెంటర్​ సంజనా గణేశన్​ను బుమ్రా వివాహం చేసుకోనున్నాడు. గోవాలో ఈనెల 14, 15 తేదీల్లో ఈ జంట ఒక్కటి కాబోతుందని సమాచారం.

CONFIRMED! Jasprit Bumrah-Sanjana Ganesan to tie the knot in Goa
ఓ ఇంటి వాడు కాబోతున్న బుమ్రా- గోవాలో పెళ్లి
author img

By

Published : Mar 13, 2021, 12:27 PM IST

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా వివాహంపై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. గోవాలో మార్చి 14, 15 తేదీల్లో ఈ జంటకు పెళ్లిభాజాలు మోగనున్నాయి. మోడల్​, టీవీ ప్రజెంటర్​ సంజనా గణేశన్​-బుమ్రా జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని యాక్టర్​ తారా శర్మ సలుజా తన ఇన్​స్టా పోస్టులో వెల్లడించింది.

"వివాహ బంధంతో త్వరలో ఒక్కటి కాబోతున్న బుమ్రా, సంజనా గణేశన్​లకు శుభాకాంక్షలు" అంటూ సలుజా ఇన్​స్టాలో పేర్కొంది.

కేవలం 20 మంది సమక్షంలోనే వివాహ కార్యక్రమం జరపనున్నట్లు తెలుస్తోంది. వారిలోనూ ఏ ఒక్కరికీ మొబైల్​ను అనుమతించరని సమాచారం.

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో భాగంగా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు బుమ్రా. వ్యక్తిగత కారణాలతోనే తనను సిరీస్​ నుంచి విడుదల చేయాలని బీసీసీఐని కోరాడు.

ఇదీ చదవండి: తొలి టీ20లో రోహిత్ ఆడకపోవడానికి కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.