2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు క్వాలిఫై అవుతుందని దిగ్గజ మాజీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రజట్లతో పోటీపడే సామర్థ్యం టీమిండియాకు ఉందని తెలిపారు.
"ప్రస్తుతం ఆస్ట్రేలియా, జర్మనీ, హాలెండ్, అర్జెంటీనా, బెల్జియం లాంటి అగ్రశ్రేణి జట్లకు తీసిపోని విధంగా భారత్ ఉంది. ఆటగాళ్లు ఏ జట్టుకు భయపడకుండా..ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ముందుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ముఖ్యం. భారత్‌కు విశ్వటోర్నీలో పతకం రావాలన్నది నా ఒక్కడి కల కాదు.. ప్రతి ఒక్కరి కల. 1980 తర్వాత హాకీలో పతకం సాధించలేదు.
-ధన్‌రాజ్ పిళ్లై, భారత మాజీ హాకీ ఆటగాడు
చివరి సారిగా భారత్ 1980లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2008లో అసలు క్వాలిఫై కాలేదు. ఈసారి టీమిండియా జట్టు బలంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌ల షెడ్యూల్ సెప్టెంబర్ 9న వెలువడనుంది.
ఇవీ చూడండి.. సెలక్టర్లకు ధోనీ సమయం.. పంత్‌కు మద్దతు