మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను 2016లో నిషేధించారు. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ, ఆటగాళ్ల పట్టుదల, వ్యూహం వల్ల పునరాగమనంలోనే చెన్నై విజేతగా అవతరించిందని అన్నారు ఆ ఫ్రాంఛైజీ యజమాని ఎన్.శ్రీనివాసన్. 'సంక్షోభ సమయంలో నాయకత్వం' అనే అంశంపై ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
"రెండేళ్ల నిషేధం రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓ సంక్షోభం చుట్టు ముట్టింది. 2018లో వచ్చీరాగానే జట్టు విజేతగా అవతరించింది. సంక్షోభం దేన్నైనా చుట్టుకోవచ్చు. కానీ ధోనీ, చెన్నై సూపర్‌కింగ్స్ దానిని అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల, పక్కా ప్రణాళికతో అధిగమించింది. ఎలాంటి సమయంలోనైనా అసాధారణ పరిస్థితి రావచ్చు. వ్యక్తులు, కార్పొరేట్, రాజకీయాలు, పార్టీలు, ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తొచ్చు. దానిని సవాల్‌గా స్వీకరించి ముందుకు నడవాలి. ఒక్క చెడు నిర్ణయం మన ప్రగతిని 20 ఏళ్ల వెనక్కి నెట్టగలదు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో వ్యక్తులు సంక్షోభాలను ముందుగానే పసిగట్టి ముందుకు సాగాలి."
-శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని
2018లో ఐపీఎల్లో పునరాగమనం చేసిన సీఎస్కే ఆ ఏడాది విజేతగా అవతరించింది. 2019లో ఫైనల్ చేరినా తుది సమరంలో ముంబయి చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
ఇవీ చూడండి.. స్పిన్నర్ అశ్విన్‌పై రికీ పాంటింగ్ ప్రశంసలు