పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం వల్ల క్వింటన్ డికాక్ కెప్టెన్సీ సందిగ్ధంలో పడిందని సౌతాఫ్రికా జట్టు కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. ఈ విషయంపై సెలెక్టర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు.
"బ్యాట్స్మెన్లు ఫామ్ కోల్పోవడమన్నది సాధారణ విషయమే. కానీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రతిదీ హైలైట్ అవుతుంది. ప్రస్తుతం డికాక్ విషయంలోనూ అభిమానులు ఇదే గుర్తించారు. ఈ విషయంపై స్వదేశానికి వెళ్లాక చర్చించి నిర్ణయం తీసుకుంటాము" అని బౌచర్ తెలిపాడు.
"సెలెక్టర్లతో కూర్చుని మాట్లాడాక ఒక నిర్ణయానికి వస్తాము. స్వదేశానికి వెళ్లాక తగినంత సమయం ఉంది. భావోద్వేగంగా కాకుండా స్మార్ట్ నిర్ణయాలు తీసుకుంటాం. టెస్టు జట్టుకు శాశ్వత నాయకుడి కోసం ప్రయత్నాలు చేస్తాం."
-మార్క్ బౌచర్, దక్షిణాఫ్రికా జట్టు కోచ్
కాగా, పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రోటీస్ జట్టు ఓటమి చవిచూసింది. 2003 తర్వాత సఫారీలపై టెస్టు సిరీస్ గెలవడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. గత డిసెంబర్లో తాత్కాలిక కెప్టెన్‌గా నియమాకం అయిన తర్వాత డికాక్.. ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
ఇదీ చదవండి: 'రిషభ్ పంత్' సెంటిమెంట్ భారత్‌కు కలిసొచ్చేనా!