బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఆసియా క్రికెట్ మండలి సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఆగ్రహించింది బోర్డు పాలకుల కమిటీ. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశాలకు గైర్హాజరు అవ్వడమే కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీకి తెలియజేయకుండా దాచారాని అందులో పేర్కొంది.
బీసీసీఐకి ఛాన్స్ పోయింది..!
ఐసీసీ భేటీ లండన్‌లో జులై 14 నుంచి 20 మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదన్న సమాచారాన్ని కేవలం రెండు రోజుల ముందు (జులై 12న) మెయిల్ చేశారని బీసీసీఐ పాలకుల కమిటీకి చెప్పింది ఐసీసీ. తక్కువ సమయమే ఉండటం వల్ల తన స్థానంలో వేరే ప్రతినిధిని పంపలేక పోయానని అమితాబ్ చెప్పినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. దీని వల్ల ఆ భేటీలో బీసీసీఐకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అభిప్రాయపడింది.
అమితాబ్ చౌదరి చర్య వల్ల బీసీసీఐ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... ఈ విషయంపై కచ్చితంగా ఆయన వివరణ తీసుకోవాలని బీసీసీఐకు సూచించింది ఐసీసీ.
ఇదీ చదవండి...