పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్‌లిన్ బుర్రలోంచి పొగలు వచ్చాయి. అవును! మీరు చదవింది నిజమే. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న లిన్ తల నుంచి పొగలు వస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదెలా సాధ్యమైందో ఎవరికీ అర్థమవడం లేదు.
రావల్పిండి వేదికగా పెషావర్ జల్మి, లాహోర్ ఖలందర్స్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జల్మి.. 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (34), హైదర్ అలీ (34) దూకుడుగా ఆడారు. మిగతా ఆటగాళ్లూ ఫర్వాలేదనిపించారు. ఖలందర్స్ బౌలింగ్ మరీ పేవలంగా ఉండటం వల్ల మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న లిన్‌కు కోపమొచ్చింది. వారిపై అరిచాడు. అప్పుడే వేడెక్కిన అతడి బుర్రలోంచి పొగలు వచ్చాయని తెలుస్తోంది.
-
Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7
— Mazher Arshad (@MazherArshad) February 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7
— Mazher Arshad (@MazherArshad) February 28, 2020Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7
— Mazher Arshad (@MazherArshad) February 28, 2020
ఈ పొగలు ఎలా వచ్చాయో? ఎందుకు వచ్చాయో తెలియదు. అదేమన్నా కెమేరా జిమ్మిక్కా అంటే? అలా అనిపించడం లేదు. టీవీల్లో ఈ చిత్రం చూసినవాళ్లంతా అవాక్కవుతున్నారు.
133 పరుగుల లక్ష్య ఛేదనలో ఖలందర్స్, 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్రిస్‌లిన్ (30), సమిత్ పటేల్ (34*), ఫకర్ జమాన్ (22) చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.