ETV Bharat / sports

పుజారా టెస్టు ఎలెవన్ జట్టు​లో కోహ్లీ, స్మిత్​!

తన ప్రపంచ ఉ్తతమ టెస్టు ఎలెవన్​ జట్టులో కోహ్లీ, స్మిత్​ ఉంటే బాగుంటుందని టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ పుజారా అభిప్రాయపడ్డాడు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Virat Kohli, Steve Smith
కోహ్లీ, స్మిత్
author img

By

Published : Aug 8, 2020, 8:33 PM IST

లాక్​డౌన్​ ప్రకటించినప్పటి నుంచి క్రికెటర్లు సోషల్​ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు, ఆన్​లైన్​ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా, భారత బ్యాట్స్​మన్​ చెతేశ్వర్​​ పుజారా ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రపంచ ఉత్తమ టెస్టు​ ఎలెవన్ జట్టులో ఎవరెవరిని ఎంచుకుంటారని అడగ్గా విరాట్​ కోహ్లీ, స్టీవ్​ స్మిత్​లతో సహా పలువురి పేర్లను వెల్లడించాడు.

డేవిడ్​ వార్నర్, కేన్​ విలియమ్సన్​లను ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ఇక కోహ్లీ, స్మిత్​లకు తర్వాతి స్థానాలు కల్పించాడు. వీరితో పాటు ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​, వికెట్​ కీపర్​ వాట్లింగ్​ కూడా తన జట్టులో ఉండాలని పుజారా కోరుకున్నాడు.

ఇక బౌలింగ్​ విషయానికొస్తే స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​, ముగ్గురు పేసర్లు జస్​ప్రీత్​ బుమ్రా, పాట్​ కమిన్స్, రబాడాలను ఎన్నుకోనున్నట్లు తెలిపాడు. వీరితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఒక వేళ మ్యాచ్​ భారత్​లో అయితే, రవీంద్ర జడేజా.. విదేశాల్లో ఉంటే మహ్మద్​ షమీలను ఎంపిక చేస్తానని వివరించాడు.

పుజారా టెస్టు ఎలెవన్​ ఇదే..

డేవిడ్​ వార్నర్​, కేన్​ విలియమ్సన్​, పుజారా, విరాట్​ కోహ్లీ, స్టీవ్​ స్మిత్​, బెన్​ స్టోక్స్​, వాట్లింగ్​, అశ్విన్​, బుమ్రా, కమిన్స్, రబాడా, జడేజా(12), షమీ(13).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.