ETV Bharat / sports

ప్రాక్టీస్​ షురూ చేసిన టీమ్​ఇండియా నయావాల్​

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు టీమ్​ఇండియా నయావాల్​ ఛెతేశ్వర్​ పుజారా. సోమవారం తన స్వస్థలంలోని మైదానంలో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు.

Cheteshwar Pujara back to nets after prolonged forced covid-19 break
ప్రాక్టీస్​ మొదలుపెట్టిన టీమ్​ఇండియా నయావాల్​
author img

By

Published : Jun 22, 2020, 8:25 PM IST

కరోనా లాక్​డౌన్​ వల్ల వచ్చిన విరామం తర్వాత మైదానంలోకి మళ్లీ అడుగుపెట్టాడు టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా. సోమవారం తన స్వస్థలంలోని ఓ మైదానంలో బ్యాటింగ్​ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు పుజారా.

"చాలా కాలం తర్వాత బ్యాట్​ పట్టా. కానీ, ఒకసారి ఆడిన తర్వాత నిన్ననే ఆడినట్లు అనిపించింది" అని ఆ పోస్టుకు క్యాప్షన్​ ఇచ్చాడు టీమ్​ఇండియా నయావాల్​.

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. లాక్​డౌన్ సడలింపుల కారణంగా తాజా పరిస్థితుల్లో క్రీడా కార్యక్రమాలు తిరిగి ఊపందుకున్నాయి. ఈ క్రమంలో విరామం తర్వాత క్రీడాకారులు తమ ఫిట్​నెస్​ను తిరిగి పొందటానికి శిక్షణ మొదలుపెట్టారు.

ఇదీ చూడండి... 'ద్రవిడ్​ నాయకత్వానికి సరైన గౌరవం దక్కలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.