ఐపీఎల్ -2019 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై చెపాక్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ధోనీసేన 70 పరుగులకే బెంగళూరుని ఆలౌట్ చేసింది. చెన్నై స్పిన్నర్లు హర్భజన్, తాహిర్ ధాటికి ఆర్సీబీ బ్యాట్స్మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడేజా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. హర్భజన్కేమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుదక్కింది.
- అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు లక్ష్యాన్ని నిలకడగా ఛేదించింది. ఆరంభంలోనే వాట్సన్.. చాహల్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు రాయుడు(28), రైనా(19). పదో ఓవర్లో మొయిన్ అలీ చేతిలో రైనా పెవిలియన్ చేరాడు. కాసేపటికే రాయుడు ఔటైనా... ఇంకో వికెట్ పడకుండా పనిపూర్తి చేశారు జాదవ్(13), జడేజా(6).
బెంగళూరు జట్టులో ఓపెనర్ పార్థివ్ పటేల్(29) మినహా ఎవ్వరూ రాణించలేదు. కోహ్లీ, మొయిన్ అలీ, డివిలియర్స్, హిట్మైర్, గ్రాండ్ హోమ్, శివమ్ దుబే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
- భజ్జి, తాహిర్ అదరహో..
మొదట కోహ్లీ, మొయిన్ అలీ, డివిలియర్స్ వికెట్లు తీసి బెంగళూరును దెబ్బతీశాడు హర్భజన్. అనంతరం తాహిర్ విజృంభించి మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. శివమ్ దుబే, సైనీ, యజువేంద్ర చాహల్ వికెట్లను తీశాడు ఇమ్రాన్. వీరిద్దరే ఆర్సీబీ టాప్ఆర్డర్ని కుప్పకూల్చారు. జడేజాకు 2 వికెట్లు దక్కాయి.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బును సీఆర్పీఎఫ్ జవాన్లకు అందించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కెప్టెన్ ధోనీ చెక్‌ను అందజేశాడు.