పార్థివ్ పటేల్ అర్ధశతకంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 11 పరుగుల వద్ద సారథి కోహ్లీ (9) కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారీ ఇన్నింగ్స్ ఆశించిన డివిలియర్స్ (25) మరోసారి ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్ పార్థివ్ పటేల్ అద్భుత అర్ధశతకం సాధించి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 53 పరుగులు చేసిన తర్వాత బ్రావో బౌలింగ్‌లో ఔటయ్యాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @ChennaiIPL restrict #RCB to a total of 161/7 after 20 overs. Who do you reckon is taking this one home tonight?#RCBvCSK pic.twitter.com/BaPtSMiSYV
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 21, 2019
The @ChennaiIPL restrict #RCB to a total of 161/7 after 20 overs. Who do you reckon is taking this one home tonight?#RCBvCSK pic.twitter.com/BaPtSMiSYVInnings Break!
— IndianPremierLeague (@IPL) April 21, 2019
The @ChennaiIPL restrict #RCB to a total of 161/7 after 20 overs. Who do you reckon is taking this one home tonight?#RCBvCSK pic.twitter.com/BaPtSMiSYV
అక్షదీప్ నాథ్ (24), స్టోయినిస్ (14), పవన్ నేగి (5) విఫలమయ్యారు. మొయిల్ అలీ 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లు మొదటి నుంచి ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించారు. దీపక్ చాహర్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కోహ్లీ వికెట్ తీసి జట్టుకు శుభారంభాన్నందించాడు.
చెన్నై బౌలర్లలో చాహర్, జడేజా, బ్రావో తలా రెండు వికెట్లు దక్కించుకోగా, తాహిర్ ఒక వికెట్ తీశాడు.
ఇవీ చూడండి.. చెలరేగిన వార్నర్, స్టో.. సన్ రైజర్స్ ఘనవిజయం