బాల్ ట్యాంపరింగ్ ఉదంతం జరిగి ఏడాది గడిచినా ఇంకా క్రికెట్ అభిమానులు ఆ విషయాన్ని మర్చిపోయినట్టు లేరు. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వార్నర్, స్మిత్‌లకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వారిని గేలి చేస్తూ.. మైదానం వీడి వెళ్లాలని ఇంగ్లాండ్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్లుగా వార్నర్, ఫించ్ మైదానంలోకి వచ్చారు. వార్నర్ వస్తున్నప్పుడు "మోసగాడా వెళ్లిపో" అంటూ ఇంగ్లీష్ అభిమానులు కేకలు వేశారు. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైన వార్నర్ పెవిలియన్ చేరుతున్నప్పుడు ఇంకా పెద్దగా అరుస్తూ గేలి చేశారు.
ఆసీస్ మాజీ సారథి స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చినపుడూ ఇదే తంతు కొనసాగింది. చీట్..చీట్.. చీట్ అంటూ అభిమానులు హేళన చేశారు. అర్ధసెంచరీ, సెంచరీ పూర్తియినపుడు కూడా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్ 12 పరుగుల తేడాతో గెలిచింది. స్మిత్ శతకంతో రాణించాడు.
ఇవీ చూడండి.. WC 19: ప్రపంచకప్ థ్రిల్లింగ్ టాప్-5 మ్యాచ్‌లు ఇవే..!