భారత క్రికెట్ సంస్కృతిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. తాము అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలమనే ఆత్మవిశ్వాసం బౌలర్లలో కనిపిస్తోందని తెలిపాడు.
మహ్మద్ షమి, బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లాంటి పేసర్లతో భారత పేస్ బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారైందని దాదా కితాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశాడు.
ఈ విషయాన్ని టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో జరిగిన లైవ్ సంభాషణలో వెల్లడించాడు గంగూలీ. దీనికి సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది బీసీసీఐ.
-
On #TeamIndia's fast bowlers and what have been the key factors in bringing up the change. #DadaOpensWithMayank https://t.co/yWG8K26HiV pic.twitter.com/h6QC14IAfv
— BCCI (@BCCI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">On #TeamIndia's fast bowlers and what have been the key factors in bringing up the change. #DadaOpensWithMayank https://t.co/yWG8K26HiV pic.twitter.com/h6QC14IAfv
— BCCI (@BCCI) July 5, 2020On #TeamIndia's fast bowlers and what have been the key factors in bringing up the change. #DadaOpensWithMayank https://t.co/yWG8K26HiV pic.twitter.com/h6QC14IAfv
— BCCI (@BCCI) July 5, 2020
"టీమ్ఇండియా క్రికెటర్ల ఐక్యత , కోచ్‌లు, ఫిట్నెస్ ట్రైనర్లు అందరూ కలిసి క్రికెట్ సంస్కృతిలోనే మార్పు తెచ్చారు. బౌలర్లు తమ సత్తాను గుర్తించగలుగుతున్నారు. అత్యంత వేగంగా తాము బౌలింగ్ వేయగలమనే ధీమాను ప్రదర్శిస్తున్నారు. బ్యాట్స్‌మెన్ కూడా ఇలానే ఉన్నారు.
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
ప్రస్తుత భారత పేస్ దళం క్రికెట్ చరిత్రలోనే ఉత్తమంగా ఉందని ఇటీవల కొనియాడాడు పేసర్ మహ్మద్ షమి. ప్రపంచంలోని ఏ జట్టులోనూ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు లేరని అన్నాడు. కొత్త బంతితో ముందుగా ఎవరు బౌలింగ్ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సారథి కోహ్లీ తమకిస్తాడని తెలిపాడు.
ఇది చూడండి : 'గంగూలీ అంటే అసహ్యం పుట్టేది'
ఇది చూడండి : 'సచిన్‌ను ఔట్ చేసేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం'