టీమిండియా క్రికెటర్ల దుస్తుల్లో త్వరలో చిన్న మార్పు రానుంది. భారత్ జట్టు స్పాన్సర్‌గా ఇకపై ఒప్పో స్థానంలో బైజుస్ ఉండనుంది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ పేరు ఇప్పటి నుంచి ఆటగాళ్ల జెర్సీలపై కనిపించనుంది.
చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు 2017లో బీసీసీఐ, ఈ కంపెనీకు మధ్య ఐదేళ్లకు గానూ రూ.1079 కోట్ల ఒప్పందం జరిగింది. కానీ స్పాన్సర్షిప్ మార్చుకునే వెసులుబాటు కారణంగా ఒప్పో, బైజుస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.
"స్పాన్సర్‌షిప్‌ను మార్చుకునేందుకు ఆసక్తి చూపే కంపెనీలు ముందుగా బీసీసీఐకు సమాచారమివ్వాలి. ఇప్పుడు ఒప్పో, బైజుస్ కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్పాన్సర్‌షిప్‌ను మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి." -బీసీసీఐ అధికారి
గత ఒప్పందం ప్రకారం టీమిండియా అడే ద్వైపాక్షిక సిరీస్‌లోని ఓ మ్యాచ్‌కు రూ .4.61 కోట్లు, ఐసీసీ నిర్వహించే మ్యాచ్‌కు రూ.1.56 కోట్లను బీసీసీఐకు చెల్లించింది ఒప్పో. కొత్త ఒప్పందం ప్రకారం ఇదే మొత్తాన్ని చెల్లించనున్నారు.
దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 15 నుంచి జరగబోయే సిరీస్‌లో ఈ కొత్త జెర్సీ అందుబాటులోకి రానుంది.
ఇది సంగతి: మరోసారి జోడిగా ఆడుతున్న ముర్రే బ్రదర్స్