మూడో వన్డేలో టీమ్ఇండియాపై అదిరిపోయే బ్యాటింగ్ చేసిన సామ్ కరన్‌ను ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బట్లర్ ప్రశంసించాడు. అతడిలో ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ధోనీ సారథ్యంలో సామ్ కరన్ ఆడాడు.
"ఈరోజు(ఆదివారం) ఇన్నింగ్స్ గురించి సామ్ కరన్, ధోనీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అలానే మహీ బ్యాటింగ్ లక్షణాలు కరన్లో కనిపిస్తున్నాయి" అని మూడో వన్డే అనంతరం బట్లర్ చెప్పాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 322/9 మాత్రమే చేయగలిగింది. సామ్ కరన్(95 నాటౌట్) అద్భుత పోరాటం చేసినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు.
ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌కింగ్స్ తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇవీ చదవండి: