ETV Bharat / sports

వాన్​ ట్వీట్​పై రగడ.. కౌంటర్ ఇస్తున్న మాజీలు

ఆస్ట్రేలియాను భారత్​ తప్ప మరే జట్టు ఓడించలేదని ట్వీట్ చేసిన మైఖేల్ వాన్ ట్వీట్​పై బ్రెండన్ మె​కల్లమ్ స్పందించాడు. తర్వాతి టెస్టులో బౌల్ట్ వస్తాడని, కివీస్ పుంజుకుంటుందని రీట్వీట్ చేశాడు. అయితే న్యూజిలాండ్​కు సరైన స్పిన్నర్ లేడని గుర్తు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్​ వా.

Brendon McCullum, Mark Waugh Respond To Michael Vaughan's 'Only India Can Compete In Aussie Conditions' Tweet
ఆస్ట్రేలియా
author img

By

Published : Dec 15, 2019, 12:49 PM IST

పాకిస్థాన్​తో ఇటీవలే జరిగిన రెండు టెస్టుల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్​తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులోనూ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆసీస్ విజయాలను ఉద్దేశిస్తూ, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్​పై పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను, భారత్ మినహా మరే జట్టు ఓడించలేదు" అని వాన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

  • Only 1 Team in the World can compete in Aussie conditions against this Australian Team .. that’s #India .. No other team has the tools imo .. #AUSvNZ @FoxCricket

    — Michael Vaughan (@MichaelVaughan) December 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ట్వీట్​పై కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు. "వాన్ నువ్వు కాస్త ముందుగానే స్పందించావు. బౌల్ట్​ పునరాగమనం చేస్తాడు. అప్పుడు కివీస్​కు భారీ ప్రయోజనం చేకూరుతుంది. డే/నైట్ టెస్టులో ఆసీస్ 1-0 తేడాతో ముందంజ వేసిన న్యూజిలాండ్ మళ్లీ పుంజుకుంటుంది" అని పోస్ట్ పెట్టాడు.

  • Bit of an early crow here Vaughny? Boult to come back in will be a huge benefit to Nz. As will not having to start batting against the new pink ball under lights! Aus likely to go 1-0 up but seen enough to suggest it won’t be one way traffic throughout. Time will tell I guess..🧐

    — Brendon McCullum (@Bazmccullum) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మెకల్లమ్ ట్వీట్​పై ఆసీస్​ మాజీ క్రికెటర్ మార్క్ వా కూడా స్పందించాడు. కివీస్​కు నాణ్యమైన స్పిన్నర్ లేడని, తర్వాతి జరగబోయే రెండు టెస్టుల్లోనైనా ఆ లోటును పూడ్చుకోవాలని సూచించాడు.

  • Lack of a quality spinner big issue for NZ in the next 2 tests.

    — Mark Waugh (@juniorwaugh349) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలి టెస్టులో కివీస్‌పై ఆసీస్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్‌ 417 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌.. శనివారం ఆట ముగిసేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజులు ఆట మిగిలున్న నేపథ్యంలో ఆసీస్ విజయం లాంఛనమే అని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: డ్రోన్ రేసింగ్​లో విజేతగా కొరియా కుర్రాడు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.