ETV Bharat / sports

వెస్టిండీస్​ టెస్టు కెప్టెన్​గా క్రెయిగ్​ బ్రాత్​వైట్​

వెస్టిండీస్​ టీం టెస్టు కెప్టెన్​గా నియమితులయ్యాడు క్రెయిగ్​ బ్రాత్​వైట్​. ఈ మేరకు క్రికెట్​ వెస్టిండీస్​ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంతకుముందు.. జట్టు సారథిగా వ్యవహరించిన హోల్డర్​కు కృతజ్ఞతలు తెలిపింది.

Brathwaite replaces Holder as West Indies Test captain
వెస్టిండీస్​ టెస్టు కెప్టెన్​గా బ్రాత్​వైట్​
author img

By

Published : Mar 12, 2021, 10:09 AM IST

వెస్టిండీస్​ టెస్టు కెప్టెన్​గా క్రెయిగ్​ బ్రాత్​వైట్​ను నియమించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. జాసన్​ హోల్డర్​ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.

హోల్డర్​ గైర్హాజరీలో ఇంతకుముందు బ్రాత్​వైట్​.. 7 టెస్టుల్లో కరీబియన్​ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇటీవల బంగ్లాదేశ్​పై 2-0తో గెలిచిన సిరీస్​కు కూడా నేతృత్వం వహించింది బ్రాత్​వైటే.

37 టెస్టుల్లో 11 విజయాలు..

హోల్డర్​ 37 టెస్టుల్లో కెప్టెన్​గా చేశాడు. ఇందులో 11 విజయాలు ఉన్నాయి. 21 ఓటములు ఎదుర్కోగా, 5 మ్యాచ్​లు డ్రా అయ్యాయి. 2015లో దినేశ్​ రామ్​దిన్​ నుంచి పగ్గాలు చేపట్టాడు హోల్డర్​. ఇతడు.. ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచ నెం.1 ఆల్​రౌండర్​గా కొనసాగుతున్నాడు.

హోల్డర్​.. వెస్టిండీస్​ క్రికెట్​ను మరింత పైకి తీసుకెళ్లాడని అన్నారు క్రికెట్​ వెస్టిండీస్​ డైరెక్టర్​ జిమ్మీ ఆడమ్స్​. మరిన్ని సంవత్సరాలు.. జట్టులో రాణించాలని అభిప్రాయపడ్డారు.

తనకు టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు అప్పగించినందుకు.. సెలక్టర్లకు, బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు బ్రాత్​వైట్​. జట్టును మరింత ముందుకు తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.