ETV Bharat / sports

'భారత పేసర్లు వాగ్నర్​ అంత సమర్థులు కాదు' - cricket news

న్యూజిలాండ్​ బౌలర్​ నీల్​ వాగ్నర్​పై ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ మాథ్యూ వేడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనిలా బంతిని బౌన్స్​ చేసే పేసర్​ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే రానున్న ఆసీస్​ పర్యటనలో టీమ్ఇండియా పేసర్ల దాడి.. వాగ్నర్ అంత ప్రభావవంతగా ఉండదని అభిప్రాయపడ్డాడు.

mathew wade about indian bowlers
మాథ్యూ వాడె
author img

By

Published : Jul 31, 2020, 1:15 PM IST

రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా పేసర్ల దాడి అంత ప్రభావవంతంగా ఉండదని ఆస్ట్రేలియా​ వికెట్​ కీపర్​ మాథ్యూ వేడ్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్​ బౌలర్​ నీల్​ వాగ్నర్​ బౌన్స్​తో పోలిస్తే భారత బౌలర్లు అంత సమర్థులు కారని అన్నాడు.

బంతిని బౌన్స్​ అయ్యేలా చేయడంలో వాగ్నర్​ దిట్ట. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో.. ఆసీస్​ క్రికెటర్లు స్టీవ్​ స్మిత్​, డేవిడ్ వార్నర్​, మార్నస్​ లబుషేన్​ను ఔట్​ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

"వాగ్నర్​లా బంతిని బౌన్స్ చేసే బౌలర్లను నేను ఇప్పటి వరకు చూడలేదు. అతను చాలా స్థిరంగా ఉంటాడు. వికెట్లు తీసే క్రమంలో పరుగులు అసలు ఇవ్వడు. అయితే భారత్​లో ఈ తరహా బౌలర్లు ఉన్నారు. కానీ వాగ్నర్​ అంత ప్రభావవంతంగా వారి ప్రదర్శన ఉంటుందని నేను అనుకోవడం లేదు. నిజానికి ఇంత కచ్చితమైన బౌన్స్​ వేసే బౌలర్​ను నా కెరీర్​లో ఎప్పుడూ ఎదుర్కోలేదు."

-మాథ్యూ వేడ్, ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​

భారత్​తో జరగబోయే టెస్టు సిరీస్​ తమకు గట్టి సవాలేనని అన్నాడు వేడ్. "ఈ సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. టీమ్​ఇండియా చాలా దృఢమైన జట్టు." అని పేర్కొన్నాడు.

ఈ ఏడాది చివర్లో నాలుగు టెస్టుల సిరీస్ ​కోసం భారత్..​ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. 2018-19 లో జరిగిన టెస్టు సీరీస్​లో టీమ్​ఇండియా ట్రోఫీ దక్కించుకుంది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉంది ఆసీస్​ జట్టు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.