ETV Bharat / sports

ఇద్దరు శ్రీలంక క్రికెటర్లకు కరోనా పాజిటివ్​ - శ్రీలంక క్రికెటర్లకు కరోనా పాజిటివ్

శ్రీలంక యువ క్రికెటర్లు బినురా ఫెర్నాండో, చమికా కరుణరత్నేలకు కరోనా పాజిటివ్​గా తేలింది. వెస్టిండీస్​ పర్యటనకు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఈ కేసులు బయటపడినట్లు లంక బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది.

Binura Fernando, Chamika Karunaratne test positive for Covid-19
ఇద్దరు శ్రీలంక క్రికెటర్లకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Jan 22, 2021, 11:45 AM IST

Updated : Jan 22, 2021, 11:51 AM IST

వెస్టిండీస్​ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్​ శిక్షణా శిబిరంలో కలకలం రేగింది. ఆటగాళ్లు బినురా ఫెర్నాండో, చమికా కరుణరత్నేలకు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల విండీస్​ టూర్​కు ఎంపికైన జట్టులో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ సిరీస్​లో శ్రీలంక, వెస్టిండీస్​ మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి.

"జనవరి 20న జరిపిన ఆర్​టీ పీసీఆర్​ పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలింది. ప్రభుత్వ ఆదేశించిన కొవిడ్​ నిబంధనల ప్రకారం వారిద్దర్ని క్వారంటైన్​కు తరలించాం. జనవరి 18న ఎస్​ఎస్​సీ గ్రౌండ్స్​లో ఈ బృందం శిక్షణ ప్రారంభించింది. ఈ నెల 20న చేసిన ఆర్​టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన ఆటగాళ్లకు జనవరి 26న మరోసారి ​కొవిడ్​ టెస్ట్​లు చేయనున్నారు".

- శ్రీలంక క్రికెట్ బోర్డు

శ్రీలంక క్రికెట్​లో కొవిడ్​ కేసులు బయటపడడం ఇదే తొలిసారి. పేసర్​ ఫెర్నాండో 2015లో చివరిసారిగా పాకిస్థాన్​తో జరిగిన టీ20లో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించగా.. 2019లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో కరుణరత్నే ఆడాడు.

ఇదీ చూడండి: 'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'

Last Updated : Jan 22, 2021, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.