ETV Bharat / sports

'నా బయోపిక్​లో తను హీరో అయితే బాగుంటుంది' - భువనేశ్వర్ కుమార్ బయోపిక్​

టీమ్​ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్​ తన బయోపిక్​ తీస్తే రాజ్​కుమార్ రావును హీరోగా తీసుకోవాలని సూచించాడు. అలాగే మేరఠ్​లో ఓ క్రికెట్ అకాడమీ స్థాపించాలని ఉందని వెల్లడించాడు.

Bhuvneshwar Kumar wants Rajkumar Rao to play his role in his biopic
భువి
author img

By

Published : Jul 2, 2020, 12:09 PM IST

ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్​ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలతో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా టీమ్​ఇండియా క్రికెటర్ భువనేశ్వర్​ కుమార్​ కూడా తన బయోపిక్​పై స్పందించాడు. ఒకవేళ తన జీవిత కథతో సినిమా తీస్తే అందులో బాలీవుడ్​ హీరో రాజ్​కుమార్ రావును హీరోగా పెడితే బాగుంటుందని తన మనసులోని మాట వెల్లడించాడు.

"నాకు, బాలీవుడ్ హీరో రాజ్​కుమార్​ రావుకు మధ్య పోలికలు ఉన్నాయని కొంతమంది చెప్పారు. అందుకే నా బయోపిక్​లో అతడు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నా."

-భువనేశ్వర్ కుమార్, టీమ్​ఇండియా క్రికెటర్

ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భువనేశ్వర్ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భవిష్యత్ ప్రణాళికలను రచించుకుంటున్నాడు. మేరఠ్​లో ఓ అకాడమీని స్థాపించాలనుకున్నట్లు తెలిపాడు భువీ.

Bhuvneshwar Kumar wants Rajkumar Rao to play his role in his biopic
భువనేశ్వర్, రాజ్​కుమార్ రావు

"మేరఠ్​లో ఓ క్రికెట్ అకాడమి స్థాపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ పట్టణం నాకు ఎంతో ఇచ్చింది. అందుకే తిరిగి వారికి నేనేదో చేయాలనుకుంటున్నా. కచ్చితంగా ఆ పని చేస్తా."

-భువనేశ్వర్, టీమ్​ఇండియా క్రికెటర్

టీమ్​ఇండియా తరఫున 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువీ 200 వికెట్లు దక్కించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.