ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: టోర్నీ​ నిర్వహించేది ఈ తేదీల్లోనే! - Sourav Ganguly

ఐపీఎల్​ను ఈ ఏడాదే కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబరు 26, నవంబరు 8 తేదీల మధ్యలో నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు టోర్నీని దక్షిణాదిలో నిర్వహించడానికి బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

BCCI determined to host IPL 2020, tentative dates revealed
ఐపీఎల్​ 2020: టోర్నీ​ నిర్వహించేది ఈ తేదీల్లోనే!
author img

By

Published : Jun 17, 2020, 5:57 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్)ను ఈ ఏడాదే నిర్వహించడానికి భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలను చేస్తోంది. సెప్టెంబరు-నవంబరు మధ్యలో టోర్నీని నిర్వహించాలని తీవ్రంగా పరిశీలిస్తుంది. అనేక వార్తాసంస్థల నివేదిక ప్రకారం.. ఐపీఎల్​ను సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 విండోను బీసీసీఐ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని తెలుస్తోంది.

BCCI determined to host IPL 2020, tentative dates revealed
భారతీయ క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ)

అయితే అదే సమయంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా లేదా​ రద్దైతే తప్ప.. బీసీసీఐకి ఐపీఎల్​ను నిర్వహించే అవకాశం రాదు. సెప్టెంబరు-నవంబరు విండోను పరిగణనలోకి తీసుకుంటే.. టోర్నీని దక్షిణాదిలోనే నిర్వహించే ఛాన్స్​ ఎక్కువని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో చెన్నై, బెంగళూరు వాతావరణం సాధారణంగా ఉంటుందని బోర్డు అభిప్రాయపడుతుందని సమాచారం. అయితే కరోనాతో ముంబయి తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా మ్యాచ్​లను అక్కడ నిర్వహించేది లేదని తెలుస్తోంది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పెద్ద నగరాలతో పోలిస్తే.. వైరస్​ నియంత్రణ గల టౌన్​షిప్​లలో ఈ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టౌన్​షిప్​లోని హోటళ్లను బుక్​ చేసుకోవడం వల్ల ఖజానాపై కూడా భారం తగ్గుతుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు ప్రయాణాలు చేసే అవకాశం లేకపోవడం వల్ల.. మార్గదర్శకాలకు కట్టుబడి బీసీసీఐ టోర్నీని నిర్వహించాల్సి ఉంటుంది.

సెప్టెంబరులో ఆసియాకప్​

సెప్టెంబరు-నవంబరులో ఐపీఎల్​ నిర్వహించాలని యోచిస్తే.. సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్​ విధిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే సమయంలో ఆసియా కప్​ను జరపాలని ఆసియా క్రికెట్​ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయిస్తే.. ఐపీఎల్​లో మ్యాచ్​లను కుదించాల్సి ఉంటుంది. ​

ఇదీ చూడండి... ఐపీఎల్​కు సిద్ధంగా ఉండండి: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.