ETV Bharat / sports

ఐపీఎల్ స్పాన్సర్​గా 'డ్రీమ్​ 11' అధికారికం - డ్రీమ్ 11 ఐపీఎల్ 2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్​-2020 స్పాన్సర్​ 'డ్రీమ్​ 11' అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా రూ.222 కోట్లు బోర్డుకు చెల్లించనుందీ సంస్థ.

ఐపీఎల్ స్పాన్సర్​గా 'డ్రీమ్​ 11' అధికారికం
ఐపీఎల్ స్పాన్సర్​గా డ్రీమ్ 11
author img

By

Published : Aug 19, 2020, 9:40 PM IST

ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా 'డ్రీమ్‌ 11'ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 2021, 2022 సీజన్లకు స్పాన్సర్‌గా కొనసాగుతామన్న ఆ సంస్థ ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది. మూడేళ్ల షరతు ఉన్నప్పటికీ తక్కువ మొత్తం చెల్లిస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది.

'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటం వల్ల ఈ ఏడాది టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండలేమని వివో మొబైల్స్‌ ఇంతకుముందు ప్రకటించింది. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకునేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా బైజుస్‌ (రూ.201 కోట్లు), అన్‌అకాడమీ (రూ.170 కోట్లు), డ్రీమ్‌ 11 (రూ.222 కోట్లు) పోటీపడ్డాయి. చివరికి అత్యధిక మొత్తం వేసిన డ్రీమ్‌ 11కే హక్కులు దక్కాయి. అయితే రూ.240 కోట్లు చెల్లిస్తూ మరో రెండేళ్లు కొనసాగుతామని కంపెనీ కోరగా బీసీసీఐ తిరస్కరించింది.

'ఐపీఎల్‌-2020 టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11ను ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటించింది. డ్రీమ్‌ 11 (స్పోర్టా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) భారతీయ కంపెనీ. ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది' అని బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది.

రూ.240 కోట్లకు మరో రెండేళ్ల పాటు ఆ కంపెనీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంటామని బోర్డు అధికారి ఒకరు అన్నారు. వివోతో ఇప్పటికీ ఒప్పందం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఐపీఎల్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంపికైనందుకు సంతోషంగా ఉందని డ్రీమ్‌ 11 తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.