ETV Bharat / sports

ఐపీఎల్​లో 10 జట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం!

బీసీసీఐ వార్షిక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022 నుంచి ఐపీఎల్​లో 10 జట్లను ఆడించడం సహా బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమించినట్లు తెలుస్తోంది.

BCCI AGM approves 10 teams for 2022 IPL
ఐపీఎల్​లో 10 జట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
author img

By

Published : Dec 24, 2020, 4:22 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో కొత్త జట్ల చేర్చే విషయమై బీసీసీఐ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. దీని ప్రకారం 2022 నుంచి ఐపీఎల్​లో 10 జట్లు పోటీపడనున్నాయి.

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్​లో టీ20 క్రికెట్​ను చేర్చే విషయమై ఐసీసీ వేసిన బిడ్​కు బీసీసీఐ సపోర్ట్​గా నిలిచింది. లాక్​డౌన్​ ప్రభావంతో జీతాల్లేక ఇబ్బందులు పడ్డ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు(పురుషులు, మహిళలు) పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీసీ బోర్డులో డైరెక్టర్​గా గంగూలీ కొనసాగేందుకు పరిపాలన కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

BCCI AGM approves 10 teams for 2022 IPL
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.