బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మూడు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటం వల్ల.. అ సమయంలోనే బంగ్లా లంకలో పర్యటించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇరు దేశాల బోర్డుల మధ్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఓ తేదీ నిర్ణయించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తొలుత ఈ టెస్టు సిరీస్‌ను జులై-ఆగస్టు మధ్య నిర్వహించాలని అనుకున్నారు. కానీ వైరస్ వల్ల వాయిదా పడింది.
ఇదే కాకుండా ఐర్లాండ్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉంది బంగ్లా బోర్డు. కరోనా తగ్గుముఖం పట్టగానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించేలా మరిన్ని టోర్నీలకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇది చూడండి : దుబాయ్ ఎయిర్‌లైన్స్‌తో బీసీసీఐ చర్చలు