ఆడింది 9 మ్యాచ్‌లు.. అందులో ఓ జట్టు ఏడు విజయాలు.. కేవలం రెండే పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇంకో జట్టు ఏడు ఓటములు, రెండు మాత్రమే విజయాలతో దిగువన ఉంది.. ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సన్‌రైజర్స్‌తో పరాభవం తర్వాత జరుగనున్న ఈ మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ చేరే తొలి జట్టు అవుతుంది. ఇప్పటికే ఏడింటిలో ఓడిన ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
చెన్నై సూపర్ కింగ్స్...
ఈ సీజన్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న జట్టు చెన్నై. ధోని సారథ్యంలో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతోంది. ముంబయి, హైదరాబాద్ మినహా మిగతా జట్లపై విజయం సాధించింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే బెంగళూరుని 70 పరుగులకే ఆలౌట్ చేసి టోర్నీని ఘనంగా ఆరంభించింది. మళ్లీ అదే ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది ధోని సేన. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మహీ ఆడే అవకాశం ఉంది. సీజన్లో ఇమ్రాన్ తాహిర్ (13 వికెట్లు) అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు ధోని ఈ సీజన్లో 230 పరుగులు చేసి నిలకడ కొనసాగిస్తున్నాడు. సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తుంది చెన్నై.
-
Such a fin7sh! #WhistlePodu #Yellove #RCBvCSK 🦁💛 pic.twitter.com/G0AUTF9Jy2
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Such a fin7sh! #WhistlePodu #Yellove #RCBvCSK 🦁💛 pic.twitter.com/G0AUTF9Jy2
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2019Such a fin7sh! #WhistlePodu #Yellove #RCBvCSK 🦁💛 pic.twitter.com/G0AUTF9Jy2
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2019
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
వరుస పరాజయాతో ఢీలా పడిన బెంగళూరు జట్టు గత మ్యాచ్‌లో కోల్‌కతాపై జూలు విదిల్చింది. విరాట్ సెంచరీతో విజృంభించగా... మొయిన్ అలీ (66) అర్ధశతకంతో అదరగొట్టి జట్టుకు విజయాన్నందించారు. డివిలియర్స్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నా.. బౌలర్ల ప్రదర్శన కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ వచ్చినప్పటికీ అంతగా ఫలితం దక్కలేదు. కోల్‌కతా ఆటగాళ్లు రసెల్, రాణా వీరబాదుడుకి దాదాపు గెలుపు అంచుల వరకు వచ్చింది రైడర్స్ జట్టు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో 203 పరుగులు చేసి కొద్దిలో మ్యాచ్ చేజార్చుకుంది. ఇప్పటికే చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 70కే ఆలౌటై అప్రతిష్ఠను మూటగట్టుకుంది కోహ్లీ సేన. ఈ సారి ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
-
The Challengers host CSK tomorrow at our beloved Chinnaswamy stadium. Let's show them the power of the 12th Man. Let's cheer bold! #PlayBold pic.twitter.com/kNMJ6lXhRF
— Royal Challengers (@RCBTweets) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Challengers host CSK tomorrow at our beloved Chinnaswamy stadium. Let's show them the power of the 12th Man. Let's cheer bold! #PlayBold pic.twitter.com/kNMJ6lXhRF
— Royal Challengers (@RCBTweets) April 20, 2019The Challengers host CSK tomorrow at our beloved Chinnaswamy stadium. Let's show them the power of the 12th Man. Let's cheer bold! #PlayBold pic.twitter.com/kNMJ6lXhRF
— Royal Challengers (@RCBTweets) April 20, 2019
జట్ల అంచనా...
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), సురేశ్ రైనా, వాట్సన్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, రాయుడు, ఇమ్రాన్ తాహిర్, డుప్లెసిస్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్, సామ్ బిల్లింగ్స్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిల్ అలీ, స్టాయినిస్, డివిలియర్స్, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, డేల్ స్టెయిన్, సిరాజ్, నవదీప్ సైనీ, చాహల్.
ఇవీ చూడండి.. రాజస్థాన్‌ను గెలిపించిన సారథి స్మిత్