ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్‌లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో మన ఆటగాళ్లు తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసీస్ మీడియాకు చెందిన 9న్యూస్, ఏబీసీ.నెట్.ఏయూ, క్రికెట్.కామ్.ఏయూ, 7 ఛానెల్ తదితర మీడియా సంస్థలు కూడా భార్తను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్స్ చేస్తున్నాయి.
-
Wow. WOW.
— 7Cricket (@7Cricket) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
For the first time in more than three decades, Australia are beaten at the Gabba.
Which means, against ALL odds, India win the series 2-1! Unbelievable scenes 😮#AUSvIND pic.twitter.com/KJyD7zu0rM
">Wow. WOW.
— 7Cricket (@7Cricket) January 19, 2021
For the first time in more than three decades, Australia are beaten at the Gabba.
Which means, against ALL odds, India win the series 2-1! Unbelievable scenes 😮#AUSvIND pic.twitter.com/KJyD7zu0rMWow. WOW.
— 7Cricket (@7Cricket) January 19, 2021
For the first time in more than three decades, Australia are beaten at the Gabba.
Which means, against ALL odds, India win the series 2-1! Unbelievable scenes 😮#AUSvIND pic.twitter.com/KJyD7zu0rM
'గబ్బాలో భారత్ గర్జన', 'టీమ్ఇండియా చారిత్రక విజయం', 'భారత్ ప్రదర్శన అద్భుతం', 'రికార్డు బ్రేక్: గబ్బా వేదిక విజయంతో ఆసీస్‌పై భారత్ సిరీస్ సొంతం','మూడు దశాబ్దాల కాలంలో గబ్బాలో తొలిసారి ఆసీస్ ఓటమి చెందింది. భారత్ 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. నమ్మశక్యం కానిది.అంటూ పలు ట్వీట్స్ సహా హెడ్‌లైన్స్‌గా ప్రచురిస్తున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంస
టీమ్ఇండియా చారిత్రక విజయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రశంసలు కురిపించింది. ఆటగాళ్లు చూపిన ధైర్యం, తెగువ, నైపుణ్యాలు అద్భుతమని కొనియాడింది. ఈ సిరీస్‌ను గొప్పగా, ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేసిన బీసీసీఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి : మరపురాని గెలుపు- భారత క్రికెట్లో మరో మలుపు