మెల్‌బోర్న్ వేదికగా మహిళా టీమిండియాతో జరుగుతోన్న టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ఉమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్ఉమెన్ గార్డెనర్ త్రుటిలో సెంచరీ కోల్పోయినా..అద్భుతంగా రాణించింది.
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా మహిళా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ మహిళల జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
-
Ash Gardner's magnificent 93 powers us to a huge total at Junction Oval!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/Fcsz9YQf9k
">Ash Gardner's magnificent 93 powers us to a huge total at Junction Oval!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/Fcsz9YQf9kAsh Gardner's magnificent 93 powers us to a huge total at Junction Oval!
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 8, 2020
Scorecard: https://t.co/qYZh0acKUR #CmonAussie pic.twitter.com/Fcsz9YQf9k
ఆరంభంలో షాకిచ్చినా...
ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభ ఓవర్లోనే షాక్ తగిలింది. ఎదుర్కొన్న మూడో బంతికే డకౌట్‌గా వెనుదిరిగింది కంగారూ జట్టు ఓపెనర్ అలీసా హేలీ. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గార్డెనర్ (93) రన్స్‌తో ఇన్నింగ్స్‌కు పునాది వేసింది. మరో ఎండ్‌లో బెత్ మూనే (16), మెక్ లానింగ్ (37), హేన్స్ (11*), ఎలిస్ పెర్రీ (13) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... రాదా యాదవ్, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
నెగ్గాల్సిందే..
ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్ జట్టు...ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఫలితంగా ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టైటిల్ రేసులో నిలిచే అవకాశముంది.