శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అద్భుత విజయం సాధించి నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడటానికి సిద్ధమైంది. వాంఖడే వేదికగా ప్రారంభంకానున్న తొలి వన్డేలో ఫించ్ సేన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
-
Australia wins the toss and elects to bowl first in the 1st ODI against #TeamIndia at the Wankhede.#INDvAUS pic.twitter.com/4vhE55kafX
— BCCI (@BCCI) January 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Australia wins the toss and elects to bowl first in the 1st ODI against #TeamIndia at the Wankhede.#INDvAUS pic.twitter.com/4vhE55kafX
— BCCI (@BCCI) January 14, 2020Australia wins the toss and elects to bowl first in the 1st ODI against #TeamIndia at the Wankhede.#INDvAUS pic.twitter.com/4vhE55kafX
— BCCI (@BCCI) January 14, 2020
సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పినట్టుగానే ధావన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నాడు కోహ్లి.
టెస్టుల్లో.. తన భీకర ఫామ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న లబుషేన్.. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మరి బుమ్రా వంటి భారత్ టాప్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా మారింది.
భారత్:
ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లి (కెప్టెన్), శ్రేయస్, పంత్, జడేజా, శార్దూల్, కుల్‌దీప్, షమి, బుమ్రా.
ఆస్ట్రేలియా:
వార్నర్, ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, లబుషేన్, టర్నర్, కేరీ, అగార్, కమిన్స్, స్టార్క్, కేన్ రీచర్డ్సన్, జంపా.
ఈ సిరీస్‌లో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. రెండో వన్డే 17న రాజ్‌కోట్.. 19న బెంగళూరు వేదికగా చివరి వన్డే జరగనుంది.
ఇదీ చూడండి:- సచిన్ రికార్డుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ