ETV Bharat / sports

డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా చెత్త రికార్డులు - భారత్ vs ఆస్ట్రేలియా డే అండ్ నైట్ టెస్టు

భారత్​తో తొలిటెస్టులో విఫలమైన ఆస్ట్రేలియా.. తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఘోరమైన గణాంకాల్ని నమోదు చేసింది. ఇంతకీ అవేంటంటే?

Australia team worst records in day and night test
డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా చెత్త రికార్డులు
author img

By

Published : Dec 18, 2020, 7:07 PM IST

టీమ్​ఇండియాతో జరుగుతున్న డే/నైట్​ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఓ ఇన్నింగ్స్​లో చాలా తక్కువ రన్​రేట్​తో పరుగులు చేయడం సహా గులాబీ బంతితో ఆడిన మ్యాచ్​ల్లో ఆధిక్యం సంపాదించకపోవడమూ ఆసీస్​కు ఇదే తొలిసారి.

మూడు దశాబ్దాల్లో ఇదే అత్యల్పం

భారత్​తో తొలి ఇన్నింగ్స్​లో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఒకానొక దశలో 87/5తో నిలిచింది. అప్పుడు రన్​రేట్ 1.83గా ఉంది. అంటే ఓవర్​కు దాదాపు రెండు పరుగులు. గత 33 ఏళ్లలో స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఆసీస్​కు ఇదే అత్యల్పం. గత 20 ఏళ్లలో మూడుసార్లు భారత్​పైనే చాలా తక్కువ రన్​రేట్​ను కంగారూ జట్టు నమోదు చేసింది. 2013లో 1.95, 2017లో 2.04, ప్రస్తుతం 1.83 రన్​రేట్​తో పరుగులు చేశారు.

Australia team worst records in day and night test
మ్యాచ్​లోని ఓ దృశ్యం

గులాబీ టెస్టులో తొలిసారి విఫలం

ఇప్పటివరకు ఆడిన ఏడు గులాబీ బంతి టెస్టుల్లో అదరగొట్టిన ఆసీస్.. ప్రస్తుత టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకు ఆలౌటై, 53 పరుగుల వెనుకంజలో నిలిచింది. పింక్ టెస్టుల్లోని ఓ ఇన్నింగ్స్​లో 200 కంటే తక్కువ పరుగులకు ఆసీస్​ ఆలౌట్​ కావడం, ఆధిక్యం లేకుండా ఇన్నింగ్స్​ను ముగించడం ఇదే తొలిసారి.

తొలి ఇన్నింగ్స్​లో 244 పరుగులకు భారత్ ఆలౌట్​ కాగా, ఆసీస్ 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన.. రెండోరోజు పూర్తయ్యేసరికి 9/1తో నిలిచింది. క్రీజులో మయాంక్ అగర్వాల్, బుమ్రా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.