22 వరుస విజయాలతో ఇటీవల రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. తర్వాతి మ్యాచ్లోనూ గెలిచింది. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 271/7 పరుగులు చేసింది.
ఛేదనలో కివీస్ మహిళలు 200 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్. న్యూజిలాండ్ బౌలర్ లైహ్ కాస్పరెక్ ఆరు వికెట్లు తీసినప్పటికీ, ఆమె జట్టు విజయం సాధించలేకపోయింది.
మరోవైపు జోహెన్స్బర్గ్లో జరిగిన మూడో వన్డేలో గెలిచిన పాక్.. 2-1 తేడాతో సిరీస్ను చేజిక్కుంచుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 320 పరుగులు చేయగా, సఫారీ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫకర్ జమాన్ వరుసగా రెండో శతకం చేసి, గెలుపులో కీలకపాత్ర పోషించాడు.