ETV Bharat / sports

కరోనా ప్రభావం.. సిడ్నీ టెస్టుకు 25 శాతం మందే!

సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టులో 25 శాతం సామర్థ్యంతో టికెట్లు విక్రయిస్తున్నట్లు సోమవారం క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది. ఈ మ్యాచ్​కు గతంలో విడుదల చేసిన టికెట్లను రిఫండ్​ చేస్తున్నట్లు తెలిపింది.

AUS vs IND: SCG to be at 25 pc capacity for third Test
మూడో టెస్టుకు 25శాతం సామర్థ్యంతో సిడ్నీ
author img

By

Published : Jan 4, 2021, 11:54 AM IST

సిడ్నీ టెస్టులో కేవలం 25శాతం సామర్థ్యంతో టికెట్లు జారీ చేస్తున్నట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ప్రేక్షకులు, క్రికెటర్లు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా వేదిక సామర్థ్యాన్ని తగ్గించక తప్పదని సీఏ తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లీ చెప్పాడు. జనవరి 7న భారత్​, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

మైదానంలో ప్రేక్షకులకు పూర్తి భద్రత కల్పించేందుకు సీఏ, వెన్యూస్​ ఎన్​ఎస్​డబ్ల్యూ(రాష్ట్రంలో క్రీడా, సాంస్క్రతిక కార్యక్రమాలకు వేదికలను నిర్వహించే సంస్థ) కలిసి పనిచేస్తున్నాయి. కొవిడ్​ నిబంధనల అమలుకు సీటింగ్​ ఆర్డర్​ మారుస్తున్నట్లు​ హాక్లే చెప్పాడు. అందువల్ల టికెట్లను మరోసారి జారీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారికి సోమవారం నుంచి రిఫండ్​ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి: భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు లైన్ క్లియర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.