కరోనా వల్ల ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైన ఆసియా కప్ మళ్లీ వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈ టోర్నీని నిర్వహించనున్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
తొలుత ఈ టోర్నీని 2020లో పాకిస్థాన్లో జరపాలనుకున్నారు. కరోనాతో పాటు పలు కారణాల వల్ల వేదికను శ్రీలంకకు మార్చి ఈ ఏడాది ద్వితియార్థంలో నిర్వహించాలని భావించారు. ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా.. ఇప్పుడు దానిని మరో ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
1984 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో ఆసియా దేశాలు పాల్గొంటాయి. చివరగా జరిగిన 2018తో కలిపి మొత్తంగా 7 సార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. టాప్లో కొనసాగుతోంది.