ETV Bharat / sports

'టెస్టుల్లో 800 వికెట్లు అశ్విన్​కే సాధ్యం' - నాథన్ లైయన్

టీమ్ఇండియా ఆటగాడు రవిచంద్రన్​ అశ్విన్​పై శ్రీలంక మాజీ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు​. టెస్టుల్లో తన పేరుతో ఉన్న 800 వికెట్ల ఘనతను కేవలం అశ్విన్​ మాత్రమే చేరుకోగలడని అభిప్రాయపడ్డాడు.

Ashwin can take 800 wickets, Lyon not good enough, says Muralitharan
800 వికెట్లు అశ్విన్​కే సాధ్యం: ముత్తయ్య మురళీధరణ్
author img

By

Published : Jan 14, 2021, 1:33 PM IST

Updated : Jan 14, 2021, 5:25 PM IST

టెస్టు క్రికెట్​లో 800 వికెట్లు సాధించే సామర్థ్యం టీమ్​ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్​కే ఉందని అన్నాడు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్​. కానీ, ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్​​కు ఆ ఘనత సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

"అశ్విన్​.. 800 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు గొప్ప బౌలర్. మరే ఇతర యువ బౌలర్​ ఆ మైలురాయిని అందుకుంటాడని నేను అనుకోవడం లేదు. నాథన్ లియోన్​ వల్ల కూడా కాకపోవచ్చు. అతడు 400 వికెట్లకు చేరువలో ఉన్నాడు. కానీ ఆ ఘనత సాధించాలంటే అతడు మరెన్నో మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది."

- ముత్తయ్య మురళీధరన్​, శ్రీలంక మాజీ క్రికెటర్

నాథన్​ లియోన్​.. టెస్టుల్లో ఇప్పటివరకు 396 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్​, 377 వికెట్లను సాధించాడు. అయితే అశ్విన్​(25.33) సగటు.. లియోన్​ ​(31.98) కన్నా మెరుగ్గా ఉంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్​, ఆసీస్ మధ్య చివరి మ్యాచ్​ జనవరి 15న ప్రారంభం కానుంది. నాథన్​ లియోన్​కు ఇది వందో టెస్టు. ప్రస్తుత సిరీస్​లో ఇప్పటివరకు అశ్విన్ 12 వికెట్లు సాధించగా, లియోన్​ 6 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: అంత నొప్పితో ఎలా ఆడారో:అశ్విన్ భార్య

Last Updated : Jan 14, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.