యాషెస్ రెండో టెస్టులో వరుణుడు ఇబ్బంది పెట్టినా ఆట రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఓపెనర్లు రోరీ బర్న్స్ (29), జేసన్ రాయ్ (2)లతో పాటు కెప్టెన్ జో రూట్ (0), డెన్లీ (26) వెనుదిరిగారు. స్టోక్స్ (16 బ్యాటింగ్), బట్లర్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 6 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్‌కు 104 పరుగుల ఆధిక్యం ఉంది. చివరి రోజైన ఆదివారం వాతావరణం అనుకూలించి, బౌలర్ల జోరు కొనసాగితే ఫలితం వచ్చేందుకు అవకాశముంది.
అంతకు ముందు నాలుగోరోజు 80/4తో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్(92:161 బంతుల్లో 14×4) అద్భుత పోరాటంతో 250 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో రోజు 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన అతడు.. పైన్ (23), కమిన్స్ (20)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సార్లు గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు స్మిత్. అయినా తిరిగి బ్యాటింగ్‌కు దిగి పోరాటం కొనసాగించాడు. 234 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగాడు. అనంతరం 16 పరుగులు జోడించి ఆసీస్ ఇన్నింగ్స్ ముగించింది.
ఇది చదవండి: 11 సెకన్లలో 100మీ పరుగు-కేంద్ర క్రీడామంత్రి ఫిదా