వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 318 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది భారత్. వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. రెండేళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో సెంచరీ చేశాడు. ఈ విరామం అనంతరం తాను శతకం చేసినందుకు భావోద్వేగానికి లోనయ్యానని చెప్పాడు రహానే.
"విండీస్‌తో తొలి టెస్టులో 10వ సెంచరీ నమోదు చేశాను. ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం. రెండేళ్ల తర్వాత సెంచరీ చేయడం వల్ల కొంచెం భావోద్వేగం చెందా. ప్రతి సిరీస్ ముందు సరైన రీతిలో సిద్ధమవడం చాలా ముఖ్యం. ఈ రెండేళ్లు అందుకోసమే కష్టపడ్డా" - అజింక్య రహానే, టీమిండియా క్రికెటర్
విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో ఆదుకున్నాడు రహానే. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో(102) అదరగొట్టి కరీబియన్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: రిటైర్మెంట్పై రాయుడు యూటర్న్