ETV Bharat / sports

మూడోటెస్టుకు అందుబాటులో ఇంగ్లాండ్​ పేసర్​ ఆర్చర్​ - మూడోటెస్టుకు అందుబాటులో ఇంగ్లాండ్​ పేసర్​ ఆర్చర్​

'బయో బబుల్‌' నిబంధనల్ని అతిక్రమించిన ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారిక హెచ్చరిక జారీ చేయడమే కాకుండా జరిమానా విధించింది. ఆ మొత్తం ఎంతన్నది వెల్లడించలేదు. ఇప్పటికే క్రమశిక్షణ చర్యల కింద అతడిని వెస్టిండీస్‌తో రెండో టెస్టు నుంచి తప్పించిన నేపథ్యంలో.. మందలింపు, జరిమానాతో సరిపెట్టింది ఈసీబీ. దీంతో అతను మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.

Archer available for third Test against West Indies despite COVID-19 breach
మూడోటెస్టుకు అందుబాటులో ఇంగ్లాండ్​ పేసర్​ ఆర్చర్​
author img

By

Published : Jul 19, 2020, 8:51 AM IST

ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్.. వెస్టిండీస్​తో మూడో టెస్టుకు అందుబాటులోకి వస్తాడని శనివారం ప్రకటించింది ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు(ఈసీబీ). ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. కరోనా 'బయో బబుల్'​ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా రెండో టెస్టులో అతడిపై వేటు వేసింది యాజమాన్యం.

మందలింపు.. జరిమానా..

సౌథాంప్టన్​లోని తొలి టెస్టు ముగిశాక.. జులై 13న ఆర్చర్​ ఎవరికీ చెప్పకుండా బ్రిగ్​టన్​లోని తన ఇంటికి వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో బయటివ్యక్తులను కలిసినట్లు విచారణలో తేలింది. ఫలితంగా అతడిని మందిలించడమే కాకుండా జరిమానా వేసింది బోర్డు. అంతేకాకుండా ఐదురోజుల పాటు హోటల్లోనే సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉంచింది.

క్వారంటైన్​ అనంతరం రెండు సార్లు కొవిడ్​-19 టెస్టు చేయించుకున్న ఆర్చర్​కు.. నెగిటివ్​ ఫలితాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా జట్టుతో కలిసి ఆడేందుకు అనుమతినిచ్చారు. మంగళవారం ప్రాక్టీస్​లో పాల్గొననున్నాడు. శుక్రవారం(జులై 24) నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఆర్చర్​ తీరుపై మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. ఆర్చర్​ను మూడో టెస్టు నుంచి తొలగించాలని చెప్పాడు మాజీ క్రికెటర్​ మైఖేల్​ వాన్. ఆర్చర్​ చేసిన పనికి మిలియన్ పౌండ్స్ నష్టం వచ్చినా.. యువ ఆటగాడు కాబట్టి తప్పు తెలుసుకుంటాడని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్​ గిల్స్.

ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ ఆర్చర్​కు మద్దతుగా నిలిచాడు. ఇలాంటి సమయంలోనే జోఫ్రాకు తోడుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు బోర్డుకు క్షమాపణలు చెప్పాడు ఆర్చర్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.