ఐపీఎల్లో దురదృష్టకర జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ ఓటములతో ఇబ్బంది పడుతోంది. దిల్లీ క్యాపిటల్స్ కూడా నిలకడలేమితో ఓటములను ఎదుర్కొంటోంది. ఈ రెండు జట్ల మధ్య బెంగళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. మొదటగా టాస్ గెలిచిన దిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని భావిస్తోంది. కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్‌తో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించాల్సిన అవసరం ఉంది.
దిల్లీ క్యాపిటల్స్
జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ నిలకడ లేమితో బాధపడుతోంది. ఆడిన ఐదింటిలో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, ఇంగ్రామ్లతో టాప్ఆర్డర్ బలంగా ఉంది. రబాడ, బౌల్ట్, ఇషాంత్ శర్మలతో పేస్ దళం పటిష్ఠంగా ఉంది. స్పిన్‌లో సందీప్, అమిత్ మిశ్రాలు నిలకడగా రాణిస్తున్నారు. అయినప్పటికీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది దిల్లీ జట్టు.
జట్ల అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టాయినిస్, అక్షదీప్ నాథ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, టిమ్ సౌథీ.
దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, హర్షల్ పటేల్, ఇషాంత్, రబాడ, సందీప్, బౌల్ట్, క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్