ETV Bharat / sports

సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ.. ఈ సారి హర్భజన్​! - harbhajan ipl missed

చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్​ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ దుబాయ్​కు​ ఎప్పుడు వస్తాడు? లీగ్​లో పాల్గొంటాడా? లేదా? లాంటి విషయాలపై ఫ్రాంచైజీకి అధికారికంగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదని జట్టు సంబంధింత వర్గాలు తెలిపాయి. దీంతో భజ్జీ ఈ సీజన్​కు దూరం కానున్నాడనే వార్తలు జోరందుకున్నాయి.

Harbhajan
హర్భజన్
author img

By

Published : Sep 4, 2020, 6:04 AM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగలబోతుందా? పరిస్థితులు చూస్తుంటే తప్పదేమో అనిపిస్తోంది. సీఎస్కే ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా సేవలు కోల్పోయింది. ఇప్పుడు సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్​ను కూడా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తన తల్లి అనారోగ్యం కారణంగా భజ్జీ ఇంకా ఆతిథ్య దేశానికి వెళ్లలేదు. సెప్టెంబర్‌ 1 నాటికే యూఏఈకి చేరుకోవాల్సి ఉందని జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పటికీ అందుబాటులో లేడని.. అసలు టోర్నీలో ఆడతాడా? ఒకవేళ ఆడితే దుబాయ్​కు ఎప్పుడు వస్తాడు? వీటిపై ఫ్రాంచైజీకి కూడా భజ్జీ అధికారికంగా ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని వెల్లడించాయి. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్​కు దూరమవ్వనున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఎదురు దెబ్బలతో కొట్టుమిట్టాడుతోంది. తొలుత రైనా దూరమయ్యాడు. తర్వాత రుతురాజ్, దీపక్ చాహర్ ఇద్దరు కరోనా బారినపడ్డారు. 11మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకింది. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్​లో ఉన్నారు. ఇప్పుడు హర్భజన్ రాక సందేహంగా మారింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఈ మెగాలీగ్​ జరగనుంది.

ఇది చూడండి ధోనీ 'పబ్​జీ' ఆపేసి ఆ గేమ్​ ఆడుతున్నాడట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.