క్రికెట్లో ఒక్కోసారి ప్రత్యర్థులపైనా మమకారం చూపించిన ఘటనలు చూశాం. ఈ మధ్య కాలంలో స్ఫూర్తిదాయకమైన ఆటలో భాగంగా ఆటగాళ్లు చాలా స్నేహంగా ఉంటున్నారు. మైదానంలో స్నేహభావానికి గానూ ఇటీవల ఐసీసీ కోహ్లీకి అవార్డు ఇచ్చి ప్రశంసించిన సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని విశేషంగా చాటిన జట్టుగా న్యూజిలాండ్ ఐసీసీ గుర్తింపు పొందింది. కిందటి వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ ఓటమి పాలైనప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆవేదన చెందారు. ఆ ఆటగాళ్లకు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు న్యూజిలాండ్ యువ జట్టు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించింది. బుధవారం వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
భుజాలపై మోసుకెళ్లారు...
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టులోని యువ బ్యాట్స్‌మన్ కిర్క్ మెకంజీ.. కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా నడవలేకపోతూ ఇబ్బంది పడుతుంటే.. ప్రత్యర్థి జట్టులోని న్యూజిలాండ్ ఆటగాళ్లు జెస్సే టెక్సాఫ్, పేసర్ జో ఫీల్డ్ అతడిని భుజాలపై మైదానం బయటివరకు మోసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
-
An outstanding show of sportsmanship earlier today in the game between West Indies and New Zealand 👏 #U19CWC | #SpiritOfCricket | #FutureStars pic.twitter.com/UAl1G37pKj
— Cricket World Cup (@cricketworldcup) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">An outstanding show of sportsmanship earlier today in the game between West Indies and New Zealand 👏 #U19CWC | #SpiritOfCricket | #FutureStars pic.twitter.com/UAl1G37pKj
— Cricket World Cup (@cricketworldcup) January 29, 2020An outstanding show of sportsmanship earlier today in the game between West Indies and New Zealand 👏 #U19CWC | #SpiritOfCricket | #FutureStars pic.twitter.com/UAl1G37pKj
— Cricket World Cup (@cricketworldcup) January 29, 2020
అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా రెండో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన యువ కరీబియన్ జట్టు... 47.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కిర్క్ మెకంజీ(99; 104 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు)ఆకట్టుకున్నాడు. కెల్వన్ అండర్సన్(33), ఆంటోనియో మోరిస్(31) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మన్ నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లర్క్ 4, జో ఫీల్డ్, జెస్సే టెక్సాఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. డేవిడ్ హ్యాంకాక్ ఒక వికెట్ తీసుకున్నాడు.
రెండో బ్యాటింగ్‌లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రీస్ మారీ(26), లెల్మ్యాన్(29), సండే(32), సిమన్ కీన్(33), జో ఫీల్డ్(38), క్లార్క్(46) తలో చేయి వేసి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఫలితంగా సెమీఫైనల్‌కు చేరింది న్యూజిలాండ్.
ఇంకో రెండు మాత్రమే..
మరో రెండు సూపర్ లీగ్ క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్- దక్షిణాఫ్రికా(జనవరి 30), ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్(జనవరి 31) తలపడనున్నాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాయి.