ETV Bharat / sports

'ఐపీఎల్​ నుంచి తప్పుకోవడం ఎప్పుడూ కష్టమే' - కేన్​ రిచర్డ్​సన్​

తన భార్య త్వరలో ప్రసవించనున్న కారణంగానే ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి తప్పుకుంటున్నట్లు కేన్ రిచర్డ్​సన్ వెల్లడించాడు. అయితే టోర్నీ వైదొలగడం చాలా కష్టమని పేర్కొన్నాడు.

Always difficult to withdraw from a competition like the IPL: Kane Richardson
కేన్ రిచర్డ్​సన్
author img

By

Published : Sep 3, 2020, 2:16 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేసర్​ కేన్​ రిచర్డ్​సన్​ తెలిపాడు. తన భార్య నైకీ డెలివరీ త్వరలో ఉన్న కారణంగా, అలాంటి సమయంలో కుటుంబంతో పాటే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

"ఐపీఎల్​ నుంచి తప్పుకోవడం ఎప్పుడూ కష్టమే. ప్రపంచంలోని దేశవాళీ టోర్నీలో ఇదే గొప్పది. కాబట్టి దీని నుంచి వైదొలగడం తేలికైన విషయం కాదు. అయితే దీని​ కంటే ముఖ్యమైనది నా జీవతంలోకి రానుంది. ఆ సమయాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేను. త్వరలోనే నా భార్య తొలిసారి ప్రసవించనుంది. మొదటి బిడ్డ భూమి మీద అడుగుపెట్టనుంది. ఇలాంటి సమయంలో ఆమెకు నా మద్దతు చాలా అవసరం. ఐపీఎల్​ లాంటి టోర్నీలో ఆడే అవకాశాలు మళ్లీ వస్తాయి. కానీ, తండ్రిగా నేను పొందే అనుభూతి జీవితంలో ఒక్కసారే వస్తుంది"

- కేన్​ రిచర్డ్​సన్​, ఆస్ట్రేలియా ఫాస్ట్​ బౌలర్​

గతేడాది ఐపీఎల్​ వేలంలో రూ.4 కోట్లకు రిచర్డ్​సన్​ను బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. ఇతడు టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల లెగ్​ స్పిన్నర్​ ఆడమ్​ జంపాను ఆ స్థాంనలో తీసుకోనున్నట్లు ఆర్సీబీ డైరెక్టర్​ మైక్​ హెసన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.