ETV Bharat / sports

'ముస్తాక్​ అలీ టోర్నీ నిర్వహిస్తాం.. అనుమతివ్వండి'

ముస్తాక్​ అలీ టీ20 టోర్నీని తాము నిర్వహిస్తామంటూ ముంబయి క్రికెట్​ సంఘం ముందుకొచ్చింది. దీనికి అనుమతివ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్​ గంగూలీకి ఎంసీఏ​ అపెక్స్ సభ్యుడు, క్యురేటర్​ నదీమ్​ మేనన్​ విజ్ఞప్తి చేశాడు.

Allow Mumbai to stage Mushtaq Ali Trophy: MCA Apex Council member
'ముస్తాక్​ అలీ టోర్నీని నిర్వహిస్తాం.. అనుమతివ్వండి'
author img

By

Published : Sep 21, 2020, 8:49 AM IST

ఈ సీజన్లో బీసీసీఐ నిర్వహించాలనుకుంటున్న ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ముంబయి క్రికెట్​ సంఘం (ఎంసీఏ) సిద్ధంగా ఉంది. టోర్నీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఎంసీఏ అపెక్స్‌ సభ్యుడు, క్యురేటర్‌ నదీమ్‌ మేనన్‌ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అతను బోర్డు అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీకి ఈమెయిల్‌ పంపాడు.

"ముస్తాక్‌ అలీ టోర్నీని నిర్వహించే బాధ్యతను ముంబయికి అప్పగించాలి. మా దగ్గర అన్ని వసతులతో కూడిన ఆరు నాణ్యమైన స్టేడియాలు ఉన్నాయి. బీసీసీఐ నిబంధనలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో బీసీసీఐ మహిళల వన్డే టోర్నీని ముంబయిలో విజయవంతంగా నిర్వహించాం" అని నదీమ్‌ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.