ETV Bharat / sports

ఫార్మల్​ డ్రెస్​లో కోహ్లీ అదిరేటి స్టెప్పులు - mikky singh yariya song

ప్రపంచకప్​ ముందు కోహ్లీ మంచి జోష్​తో కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ఆటతో అలరించే విరాట్​ ఈసారి తన స్టెప్పులతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఓ ఛాలెంజ్​నూ​ విసిరాడు. అందులో గెలిస్తే తనని కలిసే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు.

ఫార్మల్​ డ్రెస్​లో కోహ్లీ సిగ్నేచర్​ స్టెప్పులు
author img

By

Published : May 23, 2019, 7:35 PM IST

అదిరేటి ఫార్మల్​ లుక్​లో రెడీ అయిన భారత క్రికెెట్​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ... మిక్కీ సింగ్​ 'యారి యే'పాటకు కాలుకదిపాడు. దాన్ని బీఎఫ్​ఎఫ్​ ఛాలెంజ్​ హ్యాష్​ట్యాగ్​ పేరిట ఇన్​స్టాలో పోస్టు చేశాడు. ఆ ఛాలెంజ్​ను స్వీకరించాలని క్రికెటర్లు ఏబీ డివిలియర్స్​, శ్రేయస్​ అయ్యర్​లకు సూచించాడు. అంతేకాకుండా అభిమానులను ఈ డ్యాన్స్​ ఛాలెంజ్​లో పాల్గొనాలని కోరాడు. తనలాగే నచ్చిన పాటకు డ్యాన్స్​ చేసి ట్యాగ్​ చేస్తే... తనని కలిసే అవకాశం వస్తుందని చెప్పాడు.

" ఇది నా సిగ్నేచర్​ స్టెప్పు. మీరు నా కన్నా బాగా చేయగలరేమో ప్రయత్నించండి. తర్వాత బీఎఫ్​ఎఫ్​ ఛాలెంజ్​లో పాల్గొనండి. నన్ను కలిసే అవకాశం పొందండి".
-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

" class="align-text-top noRightClick twitterSection" data="
">

గతంలోనూ చాలా సార్లు తన డ్యాన్స్​తో అలరించాడు విరాట్​. తాజాగా పెట్టిన ఈ వీడియోను 3.8 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు.
బుధవారం ఇంగ్లండ్​లో అడుగుపెట్టిన టీమిండియా... జూన్​ 5న జరగనున్న ప్రపంచకప్​ తొలి మ్యాచ్​కు సిద్ధమవుతోంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.