భారత్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్. ఇంగ్లాండ్‌తో సిరీస్ అనంతరం తమ టీ20 స్క్వాడ్‌పై ఓ అంచనాకు వస్తామని వెల్లడించాడు.
''టీ20 వరల్డ్‌కప్ భారత్‌లో జరుగనుంది. అయితే బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లో ఆడే ఆటగాళ్లే దాదాపు ప్రపంచ కప్‌లోనూ ఉంటారని అనుకుంటున్నాం. ఈ సిరీస్ తర్వాత ఆ విషయంపై స్పష్టత వస్తుంది. ఎవరైనా ఫామ్ కోల్పోయినా, గాయాల పాలైనా తిరిగి గాడిన పడటానికి ఇదే అనువైన సమయం. ప్రపంచ కప్‌నకు ముందు జరిగే ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుంది.''
-విక్రమ్ రాఠోడ్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్.
ఇంగ్లాండ్ తరహాలోనే భారత్ కూడా దూకుడుగా ఆడనుందా? అనే ప్రశ్నపై స్పందించాడు రాఠోడ్. "గేమ్‌ను గెలవడమనేది అవసరం. పరిస్థితుల బట్టి స్ట్రైక్‌రేట్ ఆధారపడుతుంది. మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు స్కోర్ ఎక్కువ చేసే అవకాశముంటుంది. లక్ష్య ఛేదనలో అది భిన్నంగా ఉండొచ్చు.. 10 ఓవర్లలోనూ ఆటను ముగించొచ్చు. లేదా 20 ఓవర్లు పట్టొచ్చు. మొత్తానికి ఆటను గెలవాలనే దృక్పథం అవసరం." అని విక్రమ్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది. అన్ని టీ20లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1తో గెలుపొందింది.
ఇదీ చదవండి: టైటిల్ వేటలో సీఎస్కే- చెమటోడుస్తున్న ఆటగాళ్లు