దక్షిణాఫ్రికాలో సుదీర్ఘకాలం తర్వాత ప్రారంభమైన త్రీటీ క్రికెట్ కప్ ఎంతో రసవత్తరంగా సాగింది. శనివారం నిర్వహించిన ఫైనల్లో ఏబీ డివిలియర్స్ సారథ్యం వహించిన ఈగల్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది.
![AB's Eagles clinch gold in the inaugural 3TC Solidarity Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ednrqlvuyaeeh3d_1807newsroom_1595082003_697.jpg)
క్రికెట్ రంగంలో కరోనా బారిన పడ్డ వారికి సాయం అందించాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్, మర్కరమ్ ద్వయం విజృంభించి ఈగల్స్‌కు స్వర్ణం సాధించి పెట్టారు. డివిలియర్స్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేయగా. మర్కరమ్ 33 బంతుల్లో 70 రన్స్ చేశాడు. ఫలితంగా జట్టు 160 పరుగులు సాధించింది.
![AB's Eagles clinch gold in the inaugural 3TC Solidarity Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ednrgmkxsaat5b1_1807newsroom_1595082003_423.jpg)
మరోవైపు వెండి పతక విజేతలైన డికాక్ కైట్స్ జట్టు.. 138 పరుగులు చేసింది. రబాడా సారథ్యంలోని కింగ్‌ఫిషర్స్ టీమ్ (113/5) స్కోరుతో కాంస్యం దక్కించుకుంది.
![AB's Eagles clinch gold in the inaugural 3TC Solidarity Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ednkot1waaa4c1r_1807newsroom_1595082003_471.jpg)
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ బ్లాక్ లివ్స్ మ్యాటర్ ఉద్యమానికి తమ మద్దతును తెలియజేస్తూ.. మోకాలిపై కూర్చున్నారు.
![AB's Eagles clinch gold in the inaugural 3TC Solidarity Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/edmyxpaxoaajqva_1807newsroom_1595082003_165.jpg)
![AB's Eagles clinch gold in the inaugural 3TC Solidarity Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/edmfhsgxsae_qyb_1807newsroom_1595082003_513.jpg)
ఇదీ చూడండి:ఐపీఎల్‌కు సన్నాహాలు ప్రారంభించిన ఫ్రాంచైజీలు