ETV Bharat / sports

ఐపీఎల్​: కోహ్లీ టీమ్​పై చాహల్​ జట్టు విజయం - చాహల్​ కోహ్లీ

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు శిబిరంలో ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​ను నిర్వహించారు. ఇందులో కోహ్లీ జట్టుపై చాహల్​ జట్టు విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్​ అద్భుత​ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

AB de Villiers stars as Team Chahal beats Team Kohli in RCB's intra-squad practice match
ఐపీఎల్​: కోహ్లీ టీమ్​పై చాహల్​ జట్టు విజయం
author img

By

Published : Sep 17, 2020, 12:08 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం తమ ఆటగాళ్లతో ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​ను నిర్వహించింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు. ఆర్సీబీ ఆటగాళ్లను కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, స్పిన్నర్​ చాహల్​ నాయకత్వంలో రెండు జట్లుగా విభజించారు. చాహల్​ తరఫున డివిలియర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

కోహ్లీ-చాహల్​ జట్లు

బ్యాట్స్​మెన్​ కాంబినేషన్లతో పాటు స్పిన్నర్లను సమంగా వేరుచేస్తూ ఆర్సీబీ​ డైరెక్టర్​ మైక్​ హెసన్​.. రెండు జట్లుగా విభజించారు. చాహల్​ జట్టులో డివిలియర్స్​తో పాటు దేవదత్​ పడిక్కల్​, ఉమేశ్​ యాదవ్​, నవదీప్​ సైనీ ఉన్నారు. కాగా కోహ్లీ జట్టులో ఇసురు ఉదానా, క్రిస్​ మెరిస్​, పార్థివ్​ పటేల్​, మహ్మద్​ సిరాజ్​ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

చాహల్​ టీమ్​ తరపున ఓపెనర్​గా బరిలో దిగిన డివిలియర్స్​ 33 బంతుల్లో 43 పరుగులు సాధించి కోహ్లీ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు పాటు దేవదత్​​ మంచి​ ప్రదర్శన చేశాడు. కోహ్లీ జట్టులోని బౌలర్ వాషింగ్టన్​ సుందర్​ కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

విదేశీ ఆటగాళ్లు లేని లోటు

ఛేదనలో కోహ్లీ, పార్థివ్​ పటేల్​ ఓపెనర్లుగా ఇన్నింగ్స్​ను ప్రారంభించారు. ఇద్దరూ మంచి ప్రదర్శన చేశారు. చాహల్​ జట్టులోని షాబాద్​ అహ్మద్​ 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్​లో కోహ్లీ జట్టుకు చాహల్​ టీమ్​ గట్టి పోటీ ఇచ్చిందని ఆర్సీబీ డైరెక్టర్​ మైక్​ హెసన్​ తెలిపాడు.

ఈ శిబిరంలో విదేశీ ఆటగాళ్లైన ఆరోన్​ ఫించ్​, మొయిన్​ అలీ, ఆడమ్​ జంపా, జోష్ ఫిలిప్​లు భాగం కాలేదు. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్​ పూర్తవ్వగానే వారంతా కలిసి లీగ్ కోసం యూఏఈ బయలుదేరుతారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.