దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి తండ్రి అయ్యాడు. నవంబరు 11న తన భార్య పాపకు జన్మనిచ్చినట్లు శుక్రవారం, ఏబీ వెల్లడించాడు. తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతలు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. యెంటే డివిలియర్స్ అని చిన్నారికి పేరు పెట్టినట్లు తెలిపారు. ఏబీడీ దంపతులకు ఇది మూడో సంతానం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఏబీ డివిలియర్స్.. తన పాపతో పాటు భార్య చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. "11-11-2020న మా కుటుంబలో ఓ అందమైన పాప అడుగుపెట్టింది. యెంటే డివీలియర్స్.. నువ్వు మా కుటుంబంలోకి రావడం మాకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తున్నాం" అని ఏబీ రాసుకొచ్చాడు.
యూఏఈ వేదికగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డివిలియర్స్ ఆడాడు. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ జట్టు.. ఎలిమినేటర్‌లో హైదరాబాద్ చేతిలో ఓడి వెనుదిరిగింది.