ETV Bharat / sports

కరోనాపై పోరాటానికి 16 ఏళ్ల మహిళా క్రికెటర్​ చేయూత

కరోనా కట్టడి కోసం 16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్​.. పశ్చిమ్​బంగా సీఎం రిలీఫ్​ ఫండ్​కు లక్ష రూపాయల విరాళమిచ్చింది​. భారత్ తరఫున ఇటీవలే టీ20 ప్రపంచకప్​ ఆడింది రిచా.

Richa ghosh cricketer
కరోనాపై పోరాటానికి 16 ఏళ్ల మహిళా క్రికెటర్​ చేయూత
author img

By

Published : Mar 29, 2020, 3:18 PM IST

భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా సినీ ప్రముఖుల నుంచి స్టార్ ప్లేయర్ల వరకు అందరూ సాయం చేస్తున్నారు. ఇప్పుడీ జాబాతిలోకి 16 ఏళ్ల మహిళా క్రికెటర్ రిచా ఘోష్ చేరింది. తన వంతుగా రూ.లక్ష విరాళాన్ని అందించింది. పశ్చిమ్​బంగా ముఖ్యమంత్రి సహాయనిధికి తన తండ్రి ద్వారా చెక్కును పంపింది. ఈ విషయాన్ని బంగాల్​ క్రికెట్​ సంఘం(క్యాబ్) వెల్లడించింది.

రిచా ఘోష్​.. ఇటీవలే జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ సహా, రెండు మ్యాచ్​ల్లో భారత్​ తరఫున ఆడింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్​తో అరంగేట్రం చేసింది.

క్యాబ్​ తరఫున దాతృత్వాన్ని చాటుకున్న మరికొన్ని సంఘాలు..

  • బంగాల్​ క్రికెట్​ సంఘంలో ఉన్న 66 మంది మ్యాచ్​ పరిశీలకులు రూ.1.5 లక్షల విరాళాన్ని పోగుచేశారు. ఇందులో 82 మంది స్కోరర్లు.. ఒక రోజు వేతనాన్ని రూ. 77,420 సమకూర్చారని క్యాబ్​ చెప్పింది.
  • క్యాబ్​-స్పోర్టింగ్​ క్లబ్​ ప్రతినిధి దీపక్​ సింగ్​.. సీఎం రిలీఫ్​ ఫండ్​కు రూ. 2 లక్షలు విరాళమిచ్చారు.
  • మాజీ మహిళా క్రికెటర్​(టెస్ట్​ ప్లేయర్​) మిథూ ముఖర్జీ.. రూ. 25,000లు విరాళం ప్రకటించారు.
  • అండర్​-23 బంగాల్​ కోచ్​ జయంతా ఘోష్​ దస్తీదర్​.. రూ. 10,000 సాయమందించారు.
  • క్యాబ్​ అనుబంధ విభాగాలైన.. వైట్​ బార్డర్​ క్లబ్​, విజయ్​ స్పోర్ట్స్​ క్లబ్​లు.. రూ.50,000 చొప్పున సీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళమిచ్చాయి.
  • ఉత్తర్​ పల్లి మిలాన్​ సంఘం, సబర్బన్​ క్లబ్​, రేంజర్​ క్లబ్​లు.. రూ. 25,000 చొప్పున సాయమందించాయి.
  • కూచ్​బేహర్​ జిల్లా స్పోర్ట్స్​ అసోసియేషన్​ సభ్యులు.. రూ. 10,000 ఆర్థిక సాయాన్ని సీఎం రిలీఫ్​ఫండ్​కు అందజేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ముందు దేశం.. ఆ తర్వాతే క్రికెట్​: హర్భజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.